Sat Jan 11 2025 19:47:02 GMT+0000 (Coordinated Universal Time)
Robert Vadra: హైదరాబాద్ లో సోనియా అల్లుడు.. విశేషమేమిటో?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తెలంగాణలో అడుగుపెట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రాబర్ట్ వాద్రా చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ లో రెండు రోజులు పర్యటించేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రజలకు ఉన్న ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటానని తెలిపారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని, బంజారాహిల్స్‌లోని మజీద్‌ను రాబర్ట్ వాద్రా సందర్శించనున్నారు.
దేశ రాజకీయాలకే ఎక్కువగా పరిమితమైన రాబర్ట్ వాద్రా తెలంగాణకు రావడంపై కూడా చర్చ జరుగుతూ ఉంది. వ్యాపారవేత్త అయిన ఆయన తెలంగాణలో ఏమైనా ప్రాజెక్టులు మొదలుపెట్టాలని అనుకుంటూ ఉన్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి.

Next Story