Thu Nov 07 2024 14:39:48 GMT+0000 (Coordinated Universal Time)
ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యత పొన్నం ప్రభాకర్ కే
ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఈ టాస్క్‌ను అప్పగించారు
ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఈ టాస్క్‌ను అప్పగించారు. ఝార్ఖండ్ తో జరిగిన రాజకీయ పరిణామాలతో దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు తరలించారు. వీరిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలున్నారు. వీరందరినీ శామీర్‌పేట్‌లోని ఒక రిసార్ట్‌కు తరలించారు. వీరందరికి అక్కడే బస ఏర్పాటు చేశారు.
ఈ నెల 5వ తేదీన...
ఈరోజు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. పది రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ పదిరోజుల్లో అక్కడే ఉంటే వారిని ప్రలోభపెడతారని భావించి ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో వారికి రక్షణ తోపాటు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి ఇక్కడకు తరలించారు. ఈ నెల 5వ తేదీన చంపై సోరెన్ బలపరీక్షకు సిద్ధపడే అవకాశాలుండటంతో ఆరోజు ఇక్కడి నుంచి బయలుదేరి ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.
Next Story