Sun Apr 06 2025 20:01:22 GMT+0000 (Coordinated Universal Time)
వర్మకు బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది. వర్మ 2018 లో నమోదయిన చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం ఈ తీర్పుచెప్పింది. మూడు నెలల జైలు శిక్షతో 3.72 లక్షల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది.
చెక్ బౌన్స్ కేసులో...
చెక్ బౌన్స్ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. దీంతో రాంగోపాల్ వర్మ ఇబ్బందుల్లో పడినట్లయింది. అయితే రామ్ గోపాల్ వర్మ పైకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయని వర్మ తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానంలో బిగ్ షాక్ తగిలినట్లయిందని ఆయనపై కేసు నమోదు చేసిన వారు చెబుతున్నారు.
Next Story