Mon Dec 23 2024 13:45:19 GMT+0000 (Coordinated Universal Time)
హనుమాన్ శోభాయాత్ర : భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామమందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమై రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ లోని హనుమాన్..
హైదరాబాద్ : రేపు హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకుని భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవ్వనున్నాయి. ఈ మేరకు కమిషనర్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. మొత్తం 21 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి డైవర్షన్ రూట్లను ఏర్పాటు చేసి.. ఏయే రూట్లలో ఎవరెవరు వెళ్లాలో వివరించారు.
ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామమందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమై రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ లోని హనుమాన్ టెంపులకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి 2 గంటల మధ్య, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఉదయం 9 నుంచి 2 గంటలు
1.లక్డీ కా పూల్ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లాలనుకునే వారు బషీర్ బాగ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్ వై జంక్షన్, నారాయణ గూడ ఫ్లై ఓవర్, బర్కత్ పుర, ఫీవర్ హాస్పిటల్, రైట్ టర్న్ తిలక్ నగర్ రోడ్, 6 నం జంక్షన్, అలీ కేఫె క్రాస్ రోడ్, మూసారాంబాగ్ మీదుగా దిల్ సుఖ్ నగర్ వెళ్లాలి.
2.దిల్ సుఖ్ నగర్ నుంచి మెహిదీ పట్నం వెళ్లాలనుకునేవాళ్లు.. ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ ఓఆర్, చాంద్రాయణ గుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా మెహిదీ పట్నం వెళ్లాలన్నారు.
మధ్యాహ్నం 2 నుంచి 7 గంటలు
1.లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ లేదా ఉప్పల్ వెళ్లే వాళ్లు వీవీ స్టాట్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారాడైజ్ ఫ్లై ఓవర్ ల మీదుగా ఉప్పల్ కు వెళ్లవచ్చు.
ఆయా రూట్లకు తగ్గట్టు ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ కోరారు. ఏదైనా అవసరమయితే ట్రాఫిక్ కంట్రోల్ రూం 040 27852482 లేదా ట్రాఫిక్ హెల్ప్ లైన్ 9010203626 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు.
Next Story