సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు: 284 మంది అరెస్టు
వీకెండ్ తనిఖీల్లో 284 మందిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు, మద్యం సేవించినవారిపై కఠిన చర్యలు చేపట్టారు.

హైదరాబాద్: వీకెండ్ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ చర్యలో మొత్తం 284 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారిని పట్టుకున్నారు.
వాహనాల విభజన:
రెండు చక్రాల వాహనాలు: 248
మూడు చక్రాల వాహనాలు: 09
నాలుగు చక్రాల వాహనాలు: 27
ఇందులో 21 మంది వ్యక్తుల బ్లడ్ ఆల్కహాల్ కంట్రేషన్ (BAC) 200 mg నుండి 500 mg/100 ml మధ్యగా ఉండగా, 12 మంది BAC స్థాయి 500 mg/100 ml కన్నా ఎక్కువగా ఉండటం గుర్తించారు.
అరెస్టు చేసిన వారిని త్వరలో కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అలాగే, ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదానికి పాల్పడి ప్రాణనష్టం కలిగిస్తే, వారికి భారతీయ న్యాయ సంహిత 2023 (సెక్షన్ 105) ప్రకారం హత్యకి సమానమైన నేరంగా కేసు నమోదు చేస్తారు. దీనికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.