Fri Apr 18 2025 21:50:06 GMT+0000 (Coordinated Universal Time)
Weather Update : నేడు హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉంటుందంటే?
హైదరాబాద్ లో నేడు వాతావరణం పై ఆ శాఖ అప్ డేట్ ఇచ్చింది. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది.

హైదరాబాద్ లో నేడు వాతావరణం పై ఆ శాఖ అప్ డేట్ ఇచ్చింది. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఫెంగల్ తుపాను తీరం దాటినా ఆ ప్రభావం తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో మధ్యాహ్నం తర్వాత వర్షం కురిసే అవకాశముందని కూడా తెలిపింది. చల్లటి గాలులు ఇప్పటికే చంపేస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో రేపు కూడా హైదరాబాద్ లో ఇలాంటి వాతావరణమే ఉంటుందని అధికారులు తెలిపారు.
Next Story