Mon Dec 23 2024 18:47:05 GMT+0000 (Coordinated Universal Time)
ఆదివాసీ యువకుడి ప్రాణాలను కాపాడిన నిమ్స్ వైద్యులు
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆదివాసీ యువకుడి ప్రాణాన్ని కాపాడారు
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆదివాసీ యువకుడి ప్రాణాన్ని కాపాడారు. దీంతో నిమ్స్ వైద్యులకు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ వారి ప్రతిభను కొనియాడుతున్నారు. ఛత్తీస్గడ్ లోని బీజాపూర్ కు చెందిన గుత్తికోయ గిరిజన తెగకు చెందిన సోది నందా అనే యువకుడికి ఛాతీలో బాణం దిగింది. అయితే అది గుండెకు దగ్గరగా చేరడంతో వైద్యులు శ్రమించి దానిని తొలగించారు.
బాణం ఛాతీ వరకూ...
బాణం గాయపడిన సోది నందాను తొలుత భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఆపరేషన్ కోసం వరంగంలో ఎంజీఎంకు తీసుకు వచ్చారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఎక్కడా వైద్యులు ఆ బాణాన్ని తొలగించే సాహసం చేయలేకపోయారు. దీంతో ఆ యువకుడిని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి ఆ బాణాన్ని తొలగించారు. ప్రస్తుతం సోదినందా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు.
Next Story