Sat Dec 21 2024 16:52:12 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఆదిమానవుడి ఆనవాళ్లు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి
హైదరాబాద్ లోని ఖాజాగూడా హిల్స్ లో ఆదిమానవుడి ఆనవాళ్లు ఉన్నాయని
హైదరాబాద్ లోని ఖాజాగూడా హిల్స్ లో ఆదిమానవుడి ఆనవాళ్లు ఉన్నాయని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO, ఆర్కియాలజిస్ట్ డాక్టర్ E. శివ నాగిరెడ్డి చెబుతున్నారు. అక్కడే ఉన్న పద్మనాభ ఆలయం చుట్టూ ఎంతో పురాతన సంపద దాగి ఉందని అన్నారు. కొత్త రాతి యుగానికి చెందిన ఆదిమానవుడి ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయనే విషయాన్ని కనుగొన్నట్లు తెలిపారు. ఐదు చోట్ల కొత్త రాతి యుగానికి సంబంధించిన మానవుడు చేసిన పలు పనులకు గుర్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు శివ నాగిరెడ్డి. స్థానికులకు చాలా మందికి ఇలాంటి విషయాలకు సంబంధించి వివరణ ఇస్తూ ఉన్నామని.. ఇవే కాకుండా చాలా అంశాలను మనం కాపాడాలని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నామని వివరించారు.
నిర్లక్ష్యానికి గురవుతున్న కళాఖండాలను కాపాడడానికి తాము ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నామని శివ నాగిరెడ్డి వివరించారు. చాలా ప్రాంతాల్లో ఎన్నో విషయాలు, అద్భుతాలు దాగి ఉన్నాయని.. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోరారు.
ఇంకా మరెన్నో విషయాలను ఈ వీడియోలో వివరించారు. దయచేసి అందరూ తప్పక చూడండి... మన చుట్టూనే ఇన్ని వింతలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకోండి..
Next Story