Thu Dec 26 2024 17:08:11 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో 11 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల అరెస్ట్
హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఈ డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. విద్యార్థులే కాకుండా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఈ డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 11 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఐటీ కంపెనీలకు చెందిన అధికారులు, ఎనిమిది మంది విద్యార్థులు ఒక వైద్యుడిని అరెస్ట్ చేశారు. డెలివరీ బాయ్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ప్రతి వీకెండ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లు కొందరు డ్రగ్స్ పార్టీలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థులే ఎక్కువగా....
డ్రగ్స్ వినియోగాన్ని ఎక్కువగా విద్యార్థులే చేస్తున్నట్లు గుర్తించామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. అయితే విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని వారిపై కేసులు నమోదు చేయాలా? వద్దా? అన్నది ఆలోచిస్తున్నామని సీీవీ ఆనంద్ తెలిపారు. ఓయో రూములు బుక్ చేసుకుని అందులో పార్టీలు చేసుకుంటున్నట్లు గుర్తించామని చెప్పారు. ఓయో రూములు నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని సీీవీ ఆనంద్ హెచ్చరించారు.
సెంట్రల్ యూనివర్సిటీలో....
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా జరుగుతుందని పోలీసులు గుర్తించారు. ఇక్కడ గంజాయి విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విద్యార్థులు డార్క్ నెట్ ద్వారా డ్రగ్స్ ను తెప్పించుకుంటున్నారు. డార్క్ నెట్ పై పోలీసుల నిఘా ఉందన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ ఆనంద్ తెలిపారు.
Next Story