Thu Jan 16 2025 13:44:15 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్కు వైరల్ ఫీవర్
దసరా పండగ ఈసారి పెద్దగా సంతోషాన్ని నింపడం లేదు. హైదరాబాద్లో అనేక కుటుంబాలు వైరల్ ఫీవర్తో అల్లాడి పోతున్నాయి
దసరా పండగ ఈసారి పెద్దగా సంతోషాన్ని నింపడం లేదు. హైదరాబాద్లో అనేక కుటుంబాలు వైరల్ ఫీవర్తో అల్లాడి పోతున్నాయి. ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడి పోతున్నాయి. వైరల్ ఫీవర్ అంటూ వైద్యులు రోగులకు చెబుతున్నప్పటికీ ఈ జ్వరాలు భయపెడుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుతో పాటు ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలు కూడా ఉండటంతో రోగులు అనేక ఇబ్బంది పడుతున్నారు. మారిన వాతావరణంతోనే ఈ రకమైన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సీజన్ మారినప్పుడు...
సాధారణంగా సీజన్ మారినప్పుడల్లా ఒక నెల వైరల్ ఫీవర్ వ్యాప్తి చెందడం సహజమే. కానీ మూడు నెలల నుంచి హైదరాబాద్లో వైరల్ ఫీవర్ తగ్గడం లేదు. అధిక సంఖ్యలో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. పేదా, ధనిక తేడా లేకుండా ఆసుపత్రి పాలవుతున్నారు. విపరీతమైన నీరసంతో రోగులు నడవలేని స్థితిలో ఆసుపత్రికి చేరుకుంటున్నారని, వారికి తక్షణం సెలైన్ పెట్టి వైద్యం అందించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుందని, పడకల సంఖ్య కూడా ఇబ్బందిగా మారిందని వైద్యులు చెబుతున్నారు.
ఆసుపత్రులన్నీ...
ఇక ప్రభుత్వ ఆసుపత్రులైతే చెప్పాల్సిన పనిలేదు. పడకలు దొరక్క పోయినా ఒకే పడకను ఇద్దరు పంచుకుంటున్న పరిస్థితి కొన్ని ఆసుపత్రుల్లో కనిపిస్తుంది. ప్రయివేటు ఆసుపత్రులు కూడా పేషెంట్లతో నిండిపోయాయి. చాలా మంది ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతుండటంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. గతంలో వైరల్ ఫీవర్ రెండు మూడు రోజుల్లో తగ్గిపోయేదని, ఇప్పుడు వారాల తరబడి జ్వరం ఉండటంతో రోగులు, వారి బంధువులు భయపడిపోతున్నారు.
ఎక్కువ కాలం...
అయితే కోవిడ్ తర్వాత ఇలాంటి వైరస్లు రావడం మామూలేనని కూడా వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మందికి ఫీవర్ తగ్గినా నీరసం తగ్గడం లేదని, దీనికి కారణం యాంటీ బయాటిక్స్ వాడటమే కారణమని కూడా వైద్యులు చెబుతున్నారు. వైరల్ ఫీవర్ కు భయపడాల్సిన పనిలేదని, అయితే సకాలంలో వైద్యం తీసుకుని, తగిన మందులు వాడితే తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరికొంత కాలం ఈ వైరల్ ఫీవర్ విస్తరించే అవకాశముందని డాక్టర్లు అంటున్నారు. ముఖ్యంగా దసరా పండగ దినాల్లో హైదరాబాద్లో వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుండటంతో కొన్ని కుటుంబాలు పండగకు కూడా దూరంగానే ఉండాల్సి వస్తోంది. కొందరు తమ ఊరి ప్రయాణాలను కూడా వాయిదా వేసుకున్నారు.
Next Story