Mon Dec 23 2024 02:33:05 GMT+0000 (Coordinated Universal Time)
Eagle Squad vs Drones డ్రోన్లను కూల్చేయగల ఈగల్ స్క్వాడ్.. ప్రపంచంలోనే రెండోది
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటిఎ)లోని
ఏ మాత్రం అనుమతి లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్ ను ఎగరేస్తూ ఉంటారు. ఇక సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతాల మీద నిఘా పెట్టే ప్రయత్నాలు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అలాంటి డ్రోన్లను పట్టేయాలంటే చాలా కష్టమే. అయితే వీటి పని పట్టడానికి డేగలు సిద్ధమయ్యాయి. డ్రోన్ లపై దాడి చేయడానికి ఈగల్ స్క్వాడ్ సిద్ధమైంది. డ్రోన్లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తూ వచ్చారు. ఆ ట్రైనింగ్ విజయవంతం అయింది. తెలంగాణ పోలీసులకు దాదాపు మూడు సంవత్సరాల శ్రమ ఫలించింది. ఇద్దరు నిపుణుల దగ్గర శిక్షణ పొందిన మూడు డేగల పని తీరును చూపించారు. ఆకాశంలో ఎగిరే డ్రోన్లను ఎంతో సులువుగా ఆ డేగలు ఇట్టే పట్టేస్తూ కనిపించాయి.
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటిఎ)లోని సీనియర్ ఐపిఎస్ అధికారులతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ప్రత్యక్షంగా ఆ డేగలు చేస్తున్న పనిని వీక్షించారు. ఐఐటీఏలో 23వ బ్యాచ్ కనైన్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఐపీఎస్ అధికారులు ట్రైనర్లను, ఐఐటీఏ అధికారులను అభినందించారు. డేగలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక షెడ్‌పై కూర్చున్న డేగ అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరి.. డ్రోన్ ను పట్టుకుని వెనక్కి ఎగురుకుంటూ వచ్చేస్తోంది. ఈ పనిని డేగలు ఎంతో ఖచ్చితత్వంతో పూర్తి చేశాయి.
VVIP సందర్శనల సమయాల్లోనూ, బహిరంగ సమావేశాల కోసం వీటిని ఉపయోగించాలని ప్లాన్ చేశారు. ఈ డేగలు డ్రోన్లను గుర్తించి, ఏదైనా హాని కలిగించే ముందు వాటిని క్రిందికి లాక్కుని రాగలవు. ఈగల్ స్క్వాడ్ అంతర్గత భద్రతా విభాగం (ISW)లో భాగంగా ఉంది, ఇది తెలంగాణలో VVIP భద్రతను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పోలీసు దళం. జూలై 2020లో తెలంగాణ పోలీసులు ఈగల్ స్క్వాడ్‌తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది దేశంలో మొదటి, ఏకైక ఈగిల్ స్క్వాడ్.. నెదర్లాండ్స్ తర్వాత ప్రపంచంలో ఈ ఫీట్ సాధించిన రెండవ స్క్వాడ్ గా నిలిచింది.
మూడు నెలల వయసున్న మూడు డేగ పిల్లలను మొదట శిక్షణలో చేర్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ కోసం స్థానిక హైదరాబాదీ మొహమ్మద్ ఫరీద్, కోల్‌కతాకు చెందిన మరో ఔత్సాహిక పక్షుల శిక్షకుడు అబీర్ భండారీని నియమించారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఈ డేగలు.. డ్రోన్‌ను నేల కూల్చగల శిక్షణను పొందాయి. మూడు డేగల్లో రెండు డేగలు డ్రోన్స్ పై నిఘా ఉంచడానికి శిక్షణ పొందాయి. మరొకటి ప్రత్యేకంగా నిఘా ప్రయోజనాల కోసం శిక్షణ ఇచ్చారు. ఆ డేగకు నిఘా కెమెరాను అమర్చారు. సంబంధిత ప్రాంతాలకు సంబంధించిన అధిక నాణ్యత చిత్రాలను తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రతిరోజూ ఒక గంట పాటు డేగలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు.
Next Story