Thu Dec 05 2024 01:55:13 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ నగరంలోనూ భూప్రకంపనలు
హైదరాబాద్ లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదయినట్లు తెలిసింది
హైదరాబాద్ లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదయినట్లు తెలిసింది. హైదరాబాద్ తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో భూమి కంపించడంతో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రెండు నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. సింగరేణి బొగ్గుగనులు ఉన్న ప్రాంతాల్లోనూ, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఈ భూమి కంపించిందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అంబర్ పేట్, బోరబండ, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో భూమి కంపించిందని చెబుతున్నారు. ఒక సెకను పాటు నగరంలో భూమి కంపించిందని కొందరు చెబుతున్నారు.
తొలిసారి కంపించడంతో...
హైదరాబాద్ లో తొలిసారి భూమి కంపించింది. తెలంగాణలో రిక్టర్ స్కేల్ 5.3 గా నమోదయంది. భూమిలోపల 40 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ ఇలాంటి ప్రకంపనలు చోటు చేసుకోలేదు. సంగారెడ్డి, బీహెచ్ఎల్ ప్రాంతంలోనూ భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు తెలిపారు. గతంలో ఎన్నడూ భూమి కంపించిన దాఖలాలు లేకపోవడంతో హైదరాబాద్ కూడా డేంజర్ జోన్ లోపడిందా? అన్న అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గడ్చిరోలి జిల్లాలోనూ భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. అధికారులు దీనిపై పూర్తి వివరాలు అందించాల్సి ఉంది.
Next Story