Fri Nov 22 2024 21:44:45 GMT+0000 (Coordinated Universal Time)
అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పటి నుంచో మొదలైంది. వివిధ రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అక్టోబర్ ..
తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పటి నుంచో మొదలైంది. వివిధ రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటించబోతోంది. ఎలక్షన్ కమిషన్ అధికారుల రాకతో తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లబోతుంది. నేటి నుంచి మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇక.. మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ సారథ్యంలోని 17 మంది అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని హోటల్ తాజ్‌కృష్ణాలో బస చేయనుంది. అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహించనుంది.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం కానుంది. సీఈసీ బృందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణకు రానున్న ఎన్నికల అధికారుల బృందంలో ఎలక్షన్ కమిషనర్ అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్రశర్మ, నితీశ్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు అజయ్ భాడూ, హిర్దేశ్‌కుమార్, ఆర్కే గుప్తా, మనోజ్‌కుమార్ సాహూ తదితరులు ఉన్నారు.అయితే సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం కానున్నారు.
News Summary - ECI officials visit to Telangana state today sparks election date buzz
Next Story