Sun Jan 12 2025 09:28:00 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హీరా గ్రూపు సంస్థలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హీరా సంస్థ ఛైర్మన్ నౌరా హీరాతో పాటు సీఈవో, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
విదేశీ నిధుల రాకపై...
గతంలో నమోదయిన కేసులు ఆధారంగా ఈడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. విదేశీ నిధుల రాకపై ఆరా తీస్తున్నారు. విదేశీ నిధులు పెద్దయెత్తున వచ్చాయన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పెద్దయెత్తున హవాలా రూపంలో విదేశాలకు నిధులు పంపినట్లు అనుమానంతో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి.
Next Story