Mon Mar 31 2025 08:55:53 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్లో చిరుత .. సిటీలో హల్ చల్
హైదరాబాద్ నగరంలోకి చిరుత పులి ప్రవేశించడం కలకలం రేపింది

హైదరాబాద్ నగరంలోకి చిరుత పులి ప్రవేశించడం కలకలం రేపింది. మెట్రో స్టేషన్ కు అతి దగ్గర లోనే చిరుత సంచారాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనళకు గురవుతున్నారు. పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు అక్కడకు వచ్చి వచ్చింది చిరుతా? కాదా? అన్న దానిపై ఆరా తీశారు.
మియాపూర్ స్టేషన్ వద్దకు...
చివరకు చిరుత అని వాళ్లు కూడా గుర్తించారు. కానీ ఎక్కడి నుంచి ఈ చిరుత హైదరాబాద్ నగరంలోకి వచ్చిందో అధికారులకు అర్థం కాలేదు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఈ చిరుత సంచరించినట్లు గుర్తించిన వాళ్లు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళ ఈ చిరుత రావడంతో స్టేషన్ కు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.అయితే స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
Next Story