Thu Dec 26 2024 15:39:57 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భారీ ధర పలికిన ఫ్యాన్సీ నెంబర్లు
తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని బడా బాబులు, ప్రముఖ సంస్థలు, సెలెబ్రిటీలు..
తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని బడా బాబులు, ప్రముఖ సంస్థలు, సెలెబ్రిటీలు.. ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. అందుకే ఫ్యాన్సీ నెంబర్ల మీద దృష్టి పెడుతూ ఉంటారు. దీంతో ఆ నెంబర్లకు భారీ డిమాండ్ ఉండనే ఉంటుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో ఫాన్సీ నెంబర్లకు వేలం నిర్వహించగా.. భారీ ధరలు పలికాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం ఒక్కరోజే ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా 53,34,894 రూపాయల ఆదాయం వచ్చింది. వేలంలో అత్యధికంగా టీఎస్ 09 జీసీ 9999 నెంబర్ రూ. 21,60,000లు పలికింది. అత్యల్పంగా టీఎస్ 09 జీడీ 0027 రూ. 1,04,999కి కొనుగోలు చేశారు.
టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 లక్షలు(ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్)
టీఎస్ 09 జీడీ 0009 ను రూ.10,50,000కు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్,
టీఎస్ 09 జీడీ 0001 ను రూ.3,01,000కు ఆంధ్రా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్,
టీఎస్ 09 జీడీ 0006 ను రూ.1,83,000కు గాయజ్ జ్యువెల్లర్స్ ప్రయివేట్ లిమిటెడ్,
టీఎస్ 09 జీడీ 0019 ను రూ.1,70,000కు సితారా ఎంటర్టైన్మెంట్స్,
టీఎస్ 09 జీడీ 0045 ను రూ.1,55,000కు సాయి పృధ్వీ ఎంటర్ ప్రైజెస్,
టీఎస్ 09 జీడీ 0007 ను రూ.1,30,000కు ఫైన్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్,
టీఎస్ 09 జీడీ 0027 ను రూ.1,04,999కు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేశారు.
Next Story