Mon Dec 23 2024 07:13:32 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ కు "ఫీవర్"
హైదరాబాద్ లో జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జ్వరంతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఆసుపత్రులకు వెళుతున్నారు.
హైదరాబాద్ లో జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జ్వరంతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఆసుపత్రులకు వెళుతున్నారు. కరోనా భయంతో కొందరు, జ్వరం రెండు రోజులయినా తగ్గక పోతుండటంతో మరికొందరు భయపడి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలన్నీ జ్వరపీడితులతో కిటికిటలాడిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే కాకుండా ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా అత్యధిక మంది జ్వరంతో వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
వాతావరణంలో మార్పులు...
వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతోనే జ్వరంతో బాధపడే వారు ఎక్కువయ్యాయని వైద్యులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ చల్లగా ఉండే వాతావరణం, ఒక్కసారిగా వేడెక్కిపోవడం, ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో శరీరం కూడా దానిని తట్టుకోలేని వైద్యులు చెబుతున్నారు. దీంతో జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగానే ఉందని, అయితే భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా టెస్ట్ లు...
అయితే అనేక మంది జర్వం రెండు రోజులు తగ్గకపోతుండటంతో కరోనా టెస్ట్ లు కూడా చేయించుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ కాదని కేవలం ఇది వాతావరణ మార్పుతోనే వచ్చిన జ్వరమని తర్వాత తెలుస్తుంది. ప్రయివేటు ఆసుపత్రులయితే ముందుగా కరోనా పరీక్షలు చేస్తుండటంతో ఎక్కువ మంది ప్రజలు భయపడిపోతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరోనా టెస్ట్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నా ఏమీ అనలేకపోతున్నారు.
సాధారణ జ్వరాలేనంటూ...
హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కువ ఆసుపత్రుల్లో ఫీవర్ తో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే దీనికి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెబుతున్నా ప్రజలు మాత్రం అధికారికంగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిస్తేనే మంచిదన్న సూచనలు వస్తున్నాయి. సాధారణ జర్వంతో బాధపడే వారు కూడా కరోనా భయంతోనే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ కు ఫీవర్ పట్టుకుంది. అయితే ఇది సాధారణ జ్వరాలు మాత్రమేనని ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు.
Next Story