Tue Dec 24 2024 16:23:35 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. నేడు ఫిఫా పుట్ బాల్ మ్యాచ్
నేడు హైదరాబాద్ లో ఫిఫా ఫ్రెండ్లీ పుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు
నేడు హైదరాబాద్ లో ఫిఫా ఫ్రెండ్లీ పుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో తొలిసారి ఫిఫా ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండటంతో మ్యాచ్ చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో క్రీడాభిమానులు తరలి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
తొలిసారి హైదరాబాద్ వేదికగా...
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో తొలిసారి హైదరాబాద్ వేదికగా ఈ ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఈరోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా వర్సెస్ మలేషియా మ్యాచ్ జరగనుంది. ఫుట్ బాల్ టోర్నీకి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మ్యాచ్ లను తీసుకోవడంతో క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా క్రీడాభిమానులు వచ్చే అవకాశముంది.
Next Story