Fri Jan 10 2025 23:11:16 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ కు చేరుకున్న క్రికెటర్లు
రేపు భారత్ - ఆస్ట్రేలియా టీ 20 చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పాల్గొనేందుకు రెండు జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి
రేపు భారత్ - ఆస్ట్రేలియా టీ 20 చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పాల్గొనేందుకు రెండు జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న క్రికెటర్లకు పెద్ద యెత్తున ఫ్యాన్స్ స్వాగతం పలికారు. వారు ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు వెళతారు. అక్కడి నుంచి స్టేడియానికి వెళ్లి ప్రాక్టీస్ లో పాల్గొంటారు. ప్రత్యేక బస్సులో వారిని విమానాశ్రయం నుంచి తాజ్ కృష్ణకు తరలించారు.
పటిష్ట బందోబస్తు మధ్య...
కాగా రేపు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. మొహాలీలో ఆస్ట్రేలియా, నాగ్ పూర్ లో టీం ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగ లాంటిదే. హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్లకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి ఆటగాళ్లను విమానాశ్రయంలోని బస్సు వద్దకు తీసుకెళ్లారు. హోటల్ వద్ద కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అభిమానులు ఎవరినీ హోటల్ ప్రాంగణలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు.
Next Story