Fri Dec 20 2024 14:29:09 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాదులో కె.పి.హెచ్.బి. మెట్రో స్టేషన్ వద్ద ఓ ఫర్నిచర్ మాల్ లో
హైదరాబాదులో కె.పి.హెచ్.బి. మెట్రో స్టేషన్ వద్ద ఓ ఫర్నిచర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సౌమ్య ఫర్నిచర్ షాపులో మంటలు ఎగిసిపడ్డాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలు అర్పించింది. మెట్రో స్టేషన్ ఎస్కలేటర్ మెట్ల మీదుగా పైకి చేరుకుని మంటలు ఆర్పారు. ఫర్నిచర్ మాల్ లోని మూడో అంతస్తులో మొదట మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలు సమీపంలో ఉన్న మరో మూడు దుకాణాలకూ వ్యాపించాయి. శ్రీ ఫుట్ వరల్డ్, ఎంఎస్ ఫర్నిచర్, ఫుట్ నీడ్స్, వాచెస్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్లు తగలబడిపోయాయి.
భారీ అగ్నిప్రమాదంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. అగ్నిప్రమాదం జరిగిన స్థలంలో భారీగా పొగ వ్యాపించడంతో మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు అధికారులు.
Next Story