Mon Dec 23 2024 12:38:41 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు అంటుకున్నాయి
సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు అంటుకున్నాయి. సికింద్రాబాద్‌లోని పాలికాబజార్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం రెండు ఫైరింజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
రెండు ఫైరింజన్లు...
మంటలు అదుపులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ అని ప్రాధమికంగా నిర్ధారించారు. ఎంత మేరకు నష్టం వాటిల్లింది అన్నది కూడా కాసేపట్లో తెలియనుంది. మంటలు అదుపులోకి వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Next Story