Sun Dec 22 2024 21:05:45 GMT+0000 (Coordinated Universal Time)
Fire Accident : అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి... ఒకే కుటుంబంలో
నాంపల్లిలోని బజార్ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదం విషాదం నెలకొల్పింది. కుటుంబం మొత్తం సజీవదహనమయింది
నాంపల్లిలోని బజార్ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదం విషాదం నెలకొల్పింది. కుటుంబం మొత్తం సజీవదహనమయింది. రెండో ఫ్లోర్లో ఉన్నవాళ్లే ఎక్కువ మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తం నాలుగు అంతస్థుల భవనంలో అనేక కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ భవనంలో 8 ఫ్లాట్లలో యాభై మంది నివాసముంటున్నారు. వీరిలో 21 మందిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకురాగలిగారు. కొందరు స్పృహకోల్పోయిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకునే అవకాశముంది.
కుటుంబం మొత్తం...
అయితే రెండో ఫ్లోర్ లో ఉంటున్న కుటుంబం మొత్తం సజీవ దహనమయినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ తొమ్మిది మంది చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కారును రిపేర్ చేస్తుండగా చెలరేగిన మంటలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కెమికల్ డబ్బాలకు అంటుకుని మంటలు వ్యాప్తి చెందాయి. అయితే మూడో అంతస్థులో ఉన్న ఒక కుటుంబం ఊపిరాడక చనిపోయారని వారి బంధువులు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు. ఇందులో డాక్టర్
రమేష్ జైశ్వాల్ కోసం...
మహ్మద్ ఆజామ్ కు చెందిన భార్య ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు మనవరాళ్లు కూడా మరణించారని వారి సన్నిహితులు చెబుతున్నారు. వీరిలో ఇద్దరు బీడీఎస్ చేసి వైద్య వృత్తిలో ఉన్నారంటున్నారు. మరొకరు ఐఐటీ చేస్తున్నారని అంటున్నారు. భవన యజమాని రమేష్ జైశ్వాల్ పరారీలో ఉన్నారు. రమేష్ జైశ్వాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నివాస ప్రాంతంలో కింద పెద్దయెత్తున కెమికల్ నిల్వలు ఉంచడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు. రమేష్ జైశ్వాల్ దొరికితేనే అసలు నిజం బయటకు వస్తుంది. మృతులంతా చిన్న వయసు వారే కావడంతో వారి బంధువుల రోదనలు వర్ణనానీతం. వారిని ఓదర్చడం ఎవరి తరమూ కావడంలేదు.
మృతులు వీరే...
01. డాక్టర్ ఫర్హీన్
02. ఫైజా సమీన్
03. తూభ,
04. తరూభ
05. మహ్మద్ ఆజమ్,
06. రెహమాన్ సుల్తాన్
07. జకీర్ హుస్సేన్
08. నికత్ సుల్తానా
09, రెహానా సుల్తానా
Next Story