Fri Nov 22 2024 16:48:58 GMT+0000 (Coordinated Universal Time)
ఆపరేషన్ చిరుత సక్సెస్.. బోనులో చిక్కిన క్రూరమృగం
శంషాబాద్ లో చిరుత ను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిరుతను బోనులో బంధించారు
శంషాబాద్ లో చిరుత ను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. చిరుతను బోనులో బంధించారు. గత కొద్ది రోజులుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం జరుగుతుండటంతో ఎయిర్ పోర్టు సిబ్బందితో పాటు చుట్టు పక్కల గ్రామస్థులు కూడా భయపడిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే పై చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు ఎయిర్ పోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు.
నాలుగు రోజులుగా...
దీంతో ఇరవై ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐదు బోన్లను ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఉంచారు. గత కొద్ది రోజులుగా చిరుత బోను వరకూ వచ్చి వెనక్కు మరలి వెళుతుండటంతో చిరుత చిక్కలేదు. అయితే రాత్రి మాత్రం మేకను ఆహారంగా తినేందుకు వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. దీంతో గత కొంతకాలంగా టెన్షన్ పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనులో పడటంతో ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story