Sun Dec 22 2024 22:24:12 GMT+0000 (Coordinated Universal Time)
Phone Tapping Case : భుజంరావుకు పదిహేను రోజులు కండిషన్ బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు డీఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు డీఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. అనారోగ్యం కారణాలతోనే ఆయనకు పదిహేను రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. భుజంగరావు గతంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడటంత ఆయనకు రెండు స్టంట్లు వేశారు.
గుండె కు సంబంధించిన చికిత్స...
అయితే గుండెకు సంబంధించిన చికిత్స కోసం భుజరంగరావుకు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన హైదరాబాద్ నగరం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది.
Next Story