Thu Dec 19 2024 18:04:28 GMT+0000 (Coordinated Universal Time)
మరో ట్విస్ట్ ...కారు డ్రైవర్, అటెండర్ పేరుపై కూడా భారీగా ఆస్తులు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కారు డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కారు డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆయన బినామీలుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ అటెండర్, డ్రైవర్ పేరు మీద పెద్దయెత్తున ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఏసీబీ సోదాల్లో శివబాలకృష్ణకు 300 కోట్ల ఆస్తులకు పైగా ఉన్నట్లు గుర్తించాకు.
వారిని అదుపులోకి తీసుకుని...
కొన్ని ఆస్తులను శివబాలకృష్ణ కారు డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్ పేరు మీద పెట్టినట్లు విచారణలో తేలడంతో వారిని కూడా అదుపులోకి ఏసీబీ అధికారులు తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. డ్రైవర్ గోపీకి శివబాలకృష్ణ హోండా సిటీ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఏసీబీ విచారణలో వెల్లడయింది. ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Next Story