Mon Dec 23 2024 00:27:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫేక్ వీసాలతో కువైట్ వెళ్లేందుకు యత్నించిన మహిళలు
ఫేక్ వీసాలతో ఎంచక్కా విమానం ఎక్కి కువైట్ కు ఎగిరిపోవచ్చనుకున్నారు 44 మంది మహిళలు
ఫేక్ వీసాలతో ఎంచక్కా విమానం ఎక్కి కువైట్ కు ఎగిరిపోవచ్చనుకున్నారు 44 మంది మహిళలు. ఆఖరికి ఎయిర్ పోర్టు సిబ్బంది వారిని గుర్తించడంతో..ప్రయాణానికి బ్రేక్ పడింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరినీ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విచారణకు...
ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళలను ప్రశ్నిస్తున్నారు. వారందరినీ ఏజెంట్ మోసం చేశాడా ? లేక ఉద్దేశ పూర్వకంగా వారే నకిలీ వీసాలను సృష్టించుకుని కువైట్ వెళ్లేందుకు యత్నించారా ? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. 44 మంది మహిళల్లో తెలంగాణతో పాటు ఏపీ, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story