Sun Dec 22 2024 23:41:17 GMT+0000 (Coordinated Universal Time)
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్.. కారణం వాళ్లే
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ విమానం అత్యవసరంగా దిగింది.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ విమానం అత్యవసరంగా దిగింది. మందుబాబులు రచ్చ చేయడంతో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దుబాయ్ నుంచి కొచ్చికి వెళ్తున్న విమానంలో నలుగురు ప్యాసింజర్లు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. విమాన సిబ్బంది వారిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా మాట వినలేదు.. అంతేకాకుండా ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో నలుగురు ప్రయాణికులు విమానంలో అవాంతరాలు సృష్టించినందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జిఐఎ) పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న నలుగురు ప్రయాణికులు క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. విమానం హైదరాబాద్కు చేరుకున్న తర్వాత, సిబ్బంది వెంటనే అధికారికంగా ఫిర్యాదు చేశారు, అధికారులు ఆ మందుబాబులను అదుపులోకి తీసుకోవాలని కోరారు. ఆర్జిఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. జరిమానా విధించిన అనంతరం విడుదల చేసినట్లు ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ తెలిపారు. నిందితులను కేరళకు చెందిన శివ కుమార్, మనోజ్, డెవిడ్, దేవాన్ష్ కుట్టిగా గుర్తించారు.
Next Story