Wed Apr 02 2025 21:35:57 GMT+0000 (Coordinated Universal Time)
వీధికుక్కల దాడిలో బాలుడికి గాయాలు
చైతన్య పురి మారుతి నగర్ కాలనీలో నాలుగు సంవత్సరాల బాలుడి పై కుక్కలదాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.

చైతన్య పురి మారుతి నగర్ కాలనీలో నాలుగు సంవత్సరాల బాలుడి పై కుక్కలదాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. అనేక సార్లు వీధికుక్కల బెడద ఉందని మున్సిపాలిటీ అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు.
ఫిర్యాదు చేసినా...
మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోవడంతో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అంబర్పేట్ లో కుక్కల దాడిలో బాలుడి మరణించిన ఘటన మరవక ముందే మరోసారి దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story