Mon Dec 23 2024 12:20:44 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రెండు కోట్లు పలికిన లడ్డూ ధర... హైదరాబాద్లోనే
హైదరాబాద్ లో 1.87 కోట్ల రూపాయల ధర పలికి గణేశ్ లడ్డూ రికార్డును సృష్టించింది
గణేశ్ నవరాత్రులకు హైదరాబాద్ లో ఒక ప్రత్యేకత ఉంది. పదకొండు రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ట్యాంక్బండ్ లో నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో మంటపాలను ఏర్పాటు చేసుకుంటూ వినాయక చవితి రోజు నుంచి నగరంలో పండగ వాతావరణాన్ని ఉంచేలా చూస్తారు. ఆధ్మాత్మిక నగరంగా పదకొండు రోజుల పాటు హైదరాబాద్ విరాజిల్లుతుంది. ఇతర ప్రాంతాల నుంచి గణేశ్ నిమజ్జనం చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడి విగ్రహాలను దర్శించుకుంటారు.
రికార్డు స్థాయిలో....
అయితే అదే సమయంలో మండపంలో ఏర్పాటు చేసి పూజలు చేసిన లడ్డూకు కూడా ప్రత్యేకత ఉంది. ఖైరతాబాద్ లడ్డూను మాత్రం వేలం వేయరు. బాలాపూర్ లడ్డూ ఈసారి 30 లక్షల వెయ్యి రూపాయలు పలికింది. కొలను మోహన్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. కానీ అదేసమయంలో హైదరాబాద్ లో మరో ప్రాంతంలో 1.87 కోట్ల రూపాయల ధర పలికి లడ్డూ రికార్డును సృష్టించింది.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో జరిగిన గణేశ్ లడ్డూ వేలంలో కోటి 87లక్షలు రూపాయలు ధర పలికింది. హైదరాబాద్ లోనే ఇది అత్యంత ఎక్కువ ధర పలికినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
Next Story