Mon Dec 23 2024 10:39:29 GMT+0000 (Coordinated Universal Time)
లడ్డూ 1.20 కోట్లకు వేలం
గణేశుడి లడ్డూకు విశిష్టత ఉంది. ఈ లడ్డూ వేలంలో అనేక మంది పాల్గొని తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు
గణేశుడి లడ్డూకు విశిష్టత ఉంది. ఈ లడ్డూ వేలంలో అనేక మంది పాల్గొని తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. రికార్డుస్థాయిలో మాదాపూర్ వినాయకుడి లడ్డూ ధర పలికింది. మై హోం భుజాలో 25.50 లక్షలు ధర పలికింది. గత ఏడాది 18.50 లక్షల ధర పలికింది. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి ఈ ధరను చేజిక్కించుకున్నారు. ఈసారి మరింత ధర పలకడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రిచ్మండ్ విల్లాలో...
ఇక హైదరాబాద్ లోని రిచ్మండ్ విల్లాలో కూడా రికార్డు స్థాయిలో వినాయకుడి లడ్డూ ధర పలికింది. రిచ్ మండ్ విల్లాలో విల్లాలో కోటి 20 లక్షల ధర పలికింది. గణేశుడి లడ్డూను సొంతం చేసుకుంటే తమ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు భావిస్తారు. సొంతం చేసుకున్న లడ్డూను బంధుమిత్రులకు పంచి పెడతారు. ఈ సారి గణేశుడి లడ్డు రిచ్మండ్ విల్లాలో కోటి 20 లక్షల రూపాయలు ధర పలకడం విశేషం.
Next Story