Mon Dec 23 2024 08:10:34 GMT+0000 (Coordinated Universal Time)
GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పెరిగిన కాంగ్రెస్ బలం
నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో
నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ బలం 23కి చేరింది. కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లలో బీఆర్ఎస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీతో పాటు రాగం నాగేందర్ యాదవ్ (సెరిలింగంపల్లి), ఉప్పలపాటి శ్రీకాంత్ (మియాపూర్), మంజుల రఘునాధ్ రెడ్డి (చంద్రనగర్), నార్నె శ్రీనివాసరావు (హైదర్నగర్) ఉన్నారు. నార్నె శ్రీనివాస్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ K.T.రామారావు కి అత్యంత సన్నిహితుడు. శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదర్నగర్ వార్డును దత్తత కూడా తీసుకున్నారు. 150 వార్డుల GHMCలోని 146 మంది కార్పొరేటర్లలో, 43 మంది BRS, AIMIM కు 41, BJPకి 39, కాంగ్రెస్ కు 23 మంది ఉన్నారు.
ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల చేరికలతో శాసనసభ, మండలిలో తన బలాన్ని పెంచుకుంటున్న కాంగ్రెస్.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లోనూ కార్పొరేటర్లను చేర్చుకుంటోంది. రాబోయే రోజుల్లో మరింత మంది కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకోనున్నారు.
Next Story