Mon Dec 23 2024 08:07:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కౌన్సిల్ సమావేశం.. రచ్చకు రెడీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చాలా రోజుల తర్వాత జరగనుంది. ఈరోజు ఉదయం కౌన్సిల్ సమావేశం జరగనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చాలా రోజుల తర్వాత జరగనుంది. ఈరోజు ఉదయం కౌన్సిల్ సమావేశం జరగనుంది. కరోనా కారణంగా దాదాపు ఎన్నికలు అయిన తర్వాత కౌన్సిల్ సమావేశం జరగలేదు. వర్చువల్ పద్ధతిలో జరపాలని గతంలో నిర్ణయించినా ఒకసారికి మించి జరగలేదు. అయితే ఈసారి కౌన్సిల్ సమావేశం చాలా రోజుల తర్వాత జరుగుతుండటంతో పాలక, విపక్ష సభ్యులు తమ సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం లభించింది.
భారీ బందోబస్తు...
అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నగరంలో రహదారులు, డ్రైనేజీ, మంచినీరు వంటి సమస్యలపై ఆందోళన చేసే అవకాశముంది. ఇటీవలే బీజేపీ కార్పొరేటర్లు కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story