Mon Jan 13 2025 21:42:51 GMT+0000 (Coordinated Universal Time)
గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్....నేడు సికింద్రాబాద్ - గోవా రైలు ప్రారంభం
గోవా వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచే సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభం కానుంది.
నేటి నుంచే సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - వాస్కోడిగామా మధ్య కొత్త రైలు ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లే ఈ రైలు 20 గంటల్లో చేరుకుంటుంది. ఉదయం 11: 45 లకు సికింద్రాబాద్ లో బయలు దేరి మరుసటి రోజు 7:20 లకు గోవాకు చేరుకుంటుంది.
తక్కువ ధరలో...
సికింద్రాబాద్ నుంచి బయలు దేరే ఈ రైలు మొత్తం 20 స్టేషన్లలో ఆగుతూ గోవాకు వెళ్తుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-గోవా రైలు టికెట్ ధరలను కూడా నిర్ణయించారు. ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై 20 గంటల్లో వాస్కోడిగామా స్టేషన్ కు చేర్చుతుంది. దీనికి సంబంధిచిన టికెట్ రేట్స్ స్లీపర్ 440 రూపాయలు, త్రి టైర్ ఏసీ. 1185 రూపాయలు, టూ టైర్ ఏసీ రూ. 1700 రూపాయలుగా నిర్ణయించారు.
Next Story