Fri Nov 22 2024 15:22:33 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ లో చేరడం లేదు.. చేరను: రాజా సింగ్
గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నేత రాజా సింగ్ తాను
గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, సస్పెన్షన్‌కు గురైన బీజేపీ నేత రాజా సింగ్ తాను బీఆర్ఎస్లో చేరడం లేదని తేల్చి చెప్పారు. తన సస్పెన్షన్‌ను బీజేపీ ఉపసంహరించుకోకుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయనని.. త్వరలో బీజేపీ తన సస్పెన్షన్‌ను రద్దు చేస్తుందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గోషామహల్ నియోజకవర్గం నుంచి కాషాయ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయిస్తారని అన్నారు. ఓవైసీ సోదరులు ఎవరి పేరు చెబితే వారికే కేసీఆర్ టికెట్ ఇస్తారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోకి చచ్చినా వెళ్లబోనని రాజా సింగ్ స్పష్టం చేశారు. తాను హిందూ వాదినని, హిందూ రాష్ట్రం కోసమే పోరాడతానని అన్నారు.
తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ త్వరలోనే ఎత్తివేస్తుందని రాజా సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ తోనే పోటీ చేస్తానని చెప్పారు. ఒకవేళ బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలకు కొంత విరామం ప్రకటించి హిందూ రాష్ట్రం కోసం పనిచేస్తానని అన్నారు. అంతేకానీ లౌకిక పార్టీల్లోకి చచ్చినా వెళ్లేది లేదని అన్నారు. బీజేపీ స్టేట్ కమిటీ కానీ, సెంట్రల్ కమిటీ కానీ తన విషయంలో సానుకూలంగా ఉందని చెప్పారు. తనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయడానికి వారు సరైన సమయం కోసం చూస్తున్నారని రాజాసింగ్ అన్నారు.
Next Story