హైదరాబాద్‌లో విద్యా సంస్థలకు సెలవు
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన కారణంగా ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. ఎటు చూసినా చెరువుల్లా తలనిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు ఆరు గంటలకుపైగా భారీ వర్ష సూచన ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది, రెస్క్యూ టీమ్ సహాయ చర్యలకు రెడీగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
భారీ వర్షాల కారణంగా జీహెచ్‌సీ అధికారులు అప్రమత్తం అయ్యారు. నగరంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా రెస్య్కూటీమ్ను రంగంలోకి దింపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావదొద్దని అధకారులు సూచిస్తున్నారు. రహదారుల గుండా మ్యాన్ హోల్‌లను గమనించాలని, వాహనదారులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. నగరంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
మరో మూడు గంటల్లో భారీ వర్షం
రాజధాని హైదరాబాద్‌లో మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్‌గా ఉండాలని సూచిస్తోంది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం. అలాగే డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగాలని సూచించింది. ఇక రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద వచ్చే అవకాశం ఉంది.