Mon Dec 23 2024 09:20:59 GMT+0000 (Coordinated Universal Time)
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల సాయం
నాంపల్లి అగ్నిప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది
![kcr, ex chief minister, admitted, fractured his leg, yashoda hospital kcr, ex chief minister, admitted, fractured his leg, yashoda hospital](https://www.telugupost.com/h-upload/2023/10/29/1555407-kcr.webp)
నాంపల్లిలోని బజార్‌ఘాట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదం విన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
గాయపడిన వారికి...
గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. వారిని మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్య సాయాన్ని అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించి ఘటన జరగడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Next Story