Fri Dec 20 2024 06:09:46 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రేపు మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్ లో మద్యం దుకాణాలు మంగళవారం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్ లో మద్యం దుకాణాలు మంగళవారం మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 23న ఉదయం 6గంటల నుండి 24వ తేదీ ఉదయం 6గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా...
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలోలో జరిగే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. మద్యం దుకాణాలను ఎవరు తీసినా, అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో మందుబాబులకు రేపు నగరంలో మద్యం దొరకదు.
Next Story