Mon Mar 31 2025 22:38:44 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : మూసీ ఆక్రమణల తొలగింపునకు నోటీసులు
హైదరాబాద్ మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది

హైదరాబాద్ మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. దాదాపు పదమూడు వేల ఇళ్లు మూసీనదిని ఆక్రమించి ఉన్నాయని తేలింది. దీనిపై అధికారులు రెండు రోజుల నుంచి సర్వే చేస్తూ ఆ ఇళ్లకు నోటీసులు అంటిస్తున్నారు. స్వచ్ఛందంగా తమ ఇళ్ల నుంచి వెళ్లిపోవాని సూచిస్తున్నారు.
నోటీసులు అంటిస్తూ...
మొత్తం 21 బృందాలతో ఈ సర్వే జరుగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూంలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పోలీసుల బందోబస్తు మధ్య హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అధికారులు ఈ సర్వేచేపట్టారు.
Next Story