Mon Dec 23 2024 02:24:11 GMT+0000 (Coordinated Universal Time)
దిగొచ్చిన ప్రభుత్వం.. ట్యాంక్బండ్ లోనే నిమజ్జనం
ట్యాంక్ బండ్ పై విగ్రహాల నిమజ్జనం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నిమజ్జనంపై వివాదం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ట్యాంక్ బండ్ పై విగ్రహాల నిమజ్జనం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నిమజ్జనంపై వివాదంపై తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తుంది. ట్యాంక్బండ్ పై ఈసారి హైకోర్టు తీర్పు దృష్ట్యా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం మినహా మిగిలినవి ఇక్కడ ఏవీ జరగకూడదని ప్రభుత్వం భావించింది. అయితే దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది.
ఆమరణ దీక్షకు...
హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నిన్నటి నుంచి ఆమరణ నిరాహారా దీక్షకు దిగారు. శుక్రవారం నిమజ్జనం చేయాలని నిర్ణయించడంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని భావించింది. కానీ ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
Next Story