Sun Dec 22 2024 05:25:40 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థులందరూ సేఫ్గా
మణిపూర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ చిక్కుకున్న విద్యార్థులను ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చారు.
మణిపూర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ చిక్కుకున్న విద్యార్థులను ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చారు. వీరంతా హైదరాబాద్ చేరుకున్నారు. ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులు రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్కు వచ్చారు.
విమానాశ్రయం నుంచి...
అనంతరం, వారిని సురక్షితంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వం స్వస్థలాలకు తరలిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు పెట్టి వారి గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. గత వారం రోజుల్లోగా మణిపూర్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న విద్యార్థులను తిరిగి రప్పించడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సక్సెస్ అయ్యాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
Next Story