Mon Dec 23 2024 11:53:15 GMT+0000 (Coordinated Universal Time)
వెనక్కు వెళ్లిన మేయర్.. అవమానమేగా?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మిని స్థానికులు అడ్డుకున్నారు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మిని స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే లేకుండా ప్రారంభోత్సవానికి రావడంతో స్థానికులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ లోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మేయర్ విజయలక్ష్మి ఈరోజు ఉదయం వచ్చారు. అయితే ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండా మీరు ఎలా వస్తారంటూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.
శంకుస్థాపన చేయకుండానే....
మేయర్ ప్రొటోకాల్ పాటించకుండా శంకుస్థాపనలకు రావడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. మేయర్ ను నిలదీశారు. అయితే మేయర్ విజయలక్ష్మి మాత్రం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో చేసే పనులని, ఈ కార్యక్రమాలు ఆగవని మేయర్ కూడా కొంత స్వరం పెంచారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు నిలదీయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మేయర్ శంకుస్థాపనలు చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
Next Story