Fri Dec 27 2024 07:45:53 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో కుండపోత వర్షం
హైదరాబాద్లో కుండపోత వర్షం మొదలయింది. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో కార్యాలయాలకు వెళ్లిన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు
హైదరాబాద్లో కుండపోత వర్షం మొదలయింది. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో కార్యాలయాలకు వెళ్లిన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోని అనేక చోట్ల భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమయింది.
రహదారులన్నీ...
ఇప్పటికే రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్ పల్లి, అమీర్ పేట్, సరూర్ నగర్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ లతో పాటు నగర వ్యాప్తంగా వర్షం పడుతుంది. వర్షం భారీ స్థాయిలో కురుస్తుండటంతో ఐటీ ఉద్యోగులు కొంత ఆలస్యంగా రావాలని పోలీసులు కోరుతున్నారు. ఒక్కసారిగా అందరూ రోడ్లమీదకు వాహనాలతో వస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మ్యాన్ హోల్స్ తమ సిబ్బంది తప్ప ఎవరూ తెరవద్దని కూడా జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Next Story