Mon Dec 23 2024 19:20:12 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్లో ఒక్కసారి మారిన వాతావరణం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలయింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ కాసింది.
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలయింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ కాసింది. సాయంత్రానికి వర్షం మొదలయింది. పలు చోట్ల వర్షం కురుస్తుంది. అనేక చోట్ల వడగళ్లతో కూడిన వాన కూడా పడింది. గత నాలుగు రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈదురుగాలులు....
అయితే ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో నగరవాసులు కొంత ఊరట చెందారు. ఎండ వేడిమి నుంచి హైదరాబాదీలు కాస్త ఉపశమనం పొందినట్లయింది. అయితే ఈ వర్షంతో రేపటి నుంచి ఎండలు మరింత విజృంభిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులే ఈ అకాల వర్షాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Next Story