Fri Nov 22 2024 15:06:17 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్లో భారీ వర్షం.. వరస వర్షాలతో ఇబ్బందులే
హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడుతుంది. దాదాపు అరగంట సేపు నుంచి వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడుతుంది. దాదాపు అరగంట సేపు నుంచి వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వాహనాలు రోడ్లమీదనే నిలిచిపోయాయి. కొన్ని చోట్ల వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. రహదారులపై చేరిన నీరు ఉండటంతో వాహనాలు కొన్ని మొరాయించడం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా కార్యాలయాలు వదిలే సమయం కావడంతో ఈ ఇబ్బందులు ప్రతి రోజూ ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా విధులకు వెళ్లిన ఉద్యోగులు తిరిగి ఇంటికి చేరేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్కువ శాతం మంది మెట్రో రైళ్లను ఆశ్రయిస్తుండటంతో రైళ్లన్నీ గత కొద్ది రోజులుగా కిటకిటలాడుతున్నాయి.
మెట్రో రైళ్లు కిటకిట...
అయితే మెట్రో మార్గం లేని ప్రాంతాలకు మాత్రం సొంత వాహనాలపై వెళ్లే వారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా హైదరాబాద్ నగరం ప్రతిరోజూ వర్షం కురుస్తూ ప్రజలకు ఇబ్బందిగా మారింది. కేవలం ఉద్యోగులే కాదు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి రోజూ సాయంత్రానికి వర్షం పడుతుండటంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. మరోవైపు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అకాల వర్షాలతో పంటలు చేతికి రాక పోవడం, దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. వర్షం రోజూ పడుతుండటంతో ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్నారు. ఇక మ్యాన్ హోల్స మూతలను తెరవవద్దంటూ జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్, జూబ్లీహిల్స్, మొహిదీపట్నం, కొండాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, అమీర్ పేట్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించడంతో పోలీసులు వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story