Fri Nov 22 2024 07:14:30 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాదీలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పుడుతుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పుడుతుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సాయంత్రానికి భారీ వర్షం పడుతుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. రహదారులపైకి మళ్లీ నీరు చేరింది. గచ్చిబౌలి, టోలిచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. రాయదుర్గం ప్రాంతంలో కూడా భారీ వర్షం పడుతుండటం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు విధుల నుంచి వచ్చే సమయంలోనే పడుతుండటంతో మళ్లీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పోలీసులు తెలిపారు.
ద్రోణి బలహీన పడిందని...
అందుకే ఆలస్యంగా ఆఫీసుల నుంచి బయలుదేరాలని సూచించింది. విడతల వారీగా కార్యాలయాల నుంచి వస్తే ట్రాఫిక్ కొంత అదుపులో ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో పాటు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాద్ వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అయితే వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం మీదుగా కొనసాగిన ఆవర్తనం, ద్రోణి ఈరోజు బలహీనపడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story