Mon Dec 23 2024 19:16:13 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారు జామునుంచే పలు చోట్ల వర్షం కురుస్తుంది
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారు జామునుంచే పలు చోట్ల వర్షం కురుస్తుంది. ఎండలు మండి పోతున్న సమయంలో వర్షం కురియడంతో భాగ్యనగరవాసులు ఊరట చెందారు. హైదరాబాద్ లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నిన్న మధ్యాహ్నం వరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. బయటకు రావాలంటే ప్రజలు భయపడి పోయే పరిస్థితి ఏర్పడింది.
ఈదురుగాలులతో...
ఈ పరిస్థితుల్లో వర్షం కురియడంతో కొంత ఉపశమనం లభించింది. దీనికి తోడు ఈదురుగాలులు కూడా వీయడంతో అక్కడక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్తు స్థంభాలు నేలకొరగాయి. వెంటనే జీహెచ్ఎంసీ, విద్యుత్తు శాఖ సిబ్బంది వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
Next Story