వారికి సెలవులు లేనట్లే
సహాయక చర్యల కోసం 040-2111 1111 లేదా.. 9000113667 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా
భారీ వర్షానికి హైదరాబాద్ నగర వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. హైదరాబాద్ కు బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వరద నీరు చేరింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. టోలీచౌకీలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శాతం చెరువుకు గండికొట్టి నీటిని మూసీలోకి వదులుతున్నారు. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసింది.