Thu Dec 19 2024 19:06:36 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : మధ్యాహ్నం మూడు గంటలు దాటితే మూడు రోజులు రోడ్ల మీదకు రావద్దు.. వస్తే ఇరుక్కుపోయినట్లే
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ హెవీగా ఉండనుంది.
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ హెవీగా ఉండనుంది. మూడు రోజులు వరస సెలవులు కావడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయిని భావించి వచ్చే వారికి హై అలర్ట్. ఎందుకంటే హైదరాబాద్ లో అటు వైపు వస్తే ఇక ఇరుక్కుపోయినట్లే. మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ట్రాఫిక్ విపరీతంగా ఉండనుంది. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే, శని, ఆదివారాలు సెలవు కావడంతో ఎక్కువ మంది రహదారులపైకి సొంత వాహనాలతో వచ్చేందుకు రెడీ అయిపోతారు.
ఎగ్జిబిషన్ దృష్ట్యా...
అయితే నాంపల్లి ప్రాంతంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ దృష్ట్యా విపరీతమైన రద్దీ ఉండనుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ఈ రద్దీ కొనసాగే అవకాశముంది. పోలీసులు ఇప్పటికే సెలవు దినాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు డైవర్షన్ చేస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. ఆబిడ్స్ నుంచి దిల్సుఖ్ నగర్ కు వెళ్లే వాళ్లు, అలాగే ఎల్.బి.నగర్ నుంచి కూకట్ పల్లి వెళ్లే వాళ్లు వేరే మార్గాలను ఎంచుకుంటే మంచిది లేకుంటే ట్రాఫిక్ లో చిక్కుకోక తప్పదు.
మెట్లో బెటర్...
మూడు రోజులు వరస సెలవులు కావడంతో లక్షల సంఖ్యలో ఎగ్జిబిషన్ కు సందర్శకులు వచ్చే అవాకశముంది. వారు వచ్చే టప్పుడు, వెళ్లేటప్పుడు కూడా అంతే రద్దీ రోడ్లపై ఉండనుంది. సెలవు దినాలు కావడంతో సొంత వాహనాలను తీసుకు వచ్చేందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు. అయితే సొంత వాహనాలు కాకుండా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తే మేలని కొందరు సూచిస్తున్నారు. లేకుంటే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోక తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత మీ ఇష్టం.
Next Story