Mon Dec 23 2024 11:56:23 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో నవదీప్.. ఏమైందంటే?
మాదాపూర్ డ్రగ్స్ వ్యహారంలో హీరో నవదీప్ ను పోలీసులు ఏ29గా పేర్కొన్నారు
మాదాపూర్ డ్రగ్స్ వ్యహారంలో హీరో నవదీప్ ను పోలీసులు ఏ29గా పేర్కొన్నారు. నవదీప్ పేరును సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ లో బయటపెట్టారు. సీపీగారు నవదీప్ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్ నవదీప్ అని చెప్పలేదని నవదీప్ స్పందించాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. తాను ఎక్కడకూ పారిపోలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును నవదీప్ ఆశ్రయించాడు. ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కోర్టులో పిటిషన వేశాడు. తనను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు నవదీప్ కు ఊరటను కల్పించింది. నవదీప్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరును హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బయటపెట్టారు. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడంపై హీరో నవదీప్ స్పందించాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తాను ఎక్కడికి పారిపోలేదని.. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని స్పష్టం చేశాడు నవదీప్. సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ చూసినట్లు హీరో నవదీప్ వెల్లడించారు. అందులో సీపీ సీవీ ఆనంద్ ..నవదీప్ అని మాత్రమే మెన్షన్ చేశారని..హీరో నవదీప్ అని చెప్పలేదన్నాడు. వేరే నవదీప్ అయి ఉంటాడని తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో హీరో నవదీప్ స్పందించారు. అది నేను కాదు జెంటల్మెన్..నేను ఇక్కడే ఉన్నాను..ముందు క్లారిటీ తెచ్చుకోండి థ్యాంక్స్ అటూ పోస్ట్ పెట్టాడు. ఇక తాజాగా తనను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు నవదీప్.
Next Story