Mon Dec 23 2024 07:45:47 GMT+0000 (Coordinated Universal Time)
రాత్రి వేళ పబ్‌లలో పది దాటితే... హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్ పబ్ లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రాత్రి పది దాటితే పబ్స్ లో సౌండ్ పెట్టవద్దని ఆదేశించింది
హైదరాబాద్ పబ్ లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రాత్రి పది గంటలు దాటితే పబ్స్ లో ఎలాంటి సౌండ్ పెట్టవద్దని ఆదేశించింది. రాత్రి పది గంటల నుంచి తెల్లవారు జామున ఆరు గంటల వరకూ ఎటువంటి సౌండ్స్ పెట్టరాదని తెలిపింది. వాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంటుందని తెలిపింది. అంతే తప్ప రాత్రి వేళల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టడానికి వీలు లేదని పేర్కొంది.
ఏ నిబంధన ప్రకారం...
అసలు ఎక్సైజ్ చట్టం ప్రకారం ఇళ్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్ లకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించింది. ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇచ్చారో చెప్పాలని కోరింది. దీనిపై ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పబ్ లలో రాత్రి వేళ కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదని పేర్కొంది. టాట్ పబ్ విషయంపై హైకోర్టులో దాఖలయిన పిటీషన్ పై జరిగిన విచారణలో ఈ ఆదేశాలు జారీ చేసింది. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
Next Story